ప్రపంచ ఛాంపియన్ గా ఫలించిన సౌతాఫ్రికా కల…అసీస్ ఔట్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 213/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ జట్టు మరో 3 వికెట్లు కోల్పోయి టైటిల్ను కైవసం చేసుకుంది. బవుమా(66), మార్ క్రమ్ (136) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆసిస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా, కమిన్స్, హేజిల్ వుడ్ చెరో వికెట్ తీశారు. ఆసిస్ తొలి ఇన్నింగ్స్: 212; సఫారీల తొలి ఇన్నింగ్స్: 138; ఆసిస్ రెండో ఇన్నింగ్స్: 207, సఫారీల రెండో ఇన్నింగ్స్: 282/5. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్ (Pat Cummins) కెప్టెన్సీపై ఆసిస్, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. డెయిల్ స్టెయిన్ (Dale Stein), మాథ్యూ హెడెన్ (Matthew Hayden) మాట్లాడుతూ.. కమిన్స్ ముఖ్యంగా పరుగులు అడ్డుకునేందుకు మాత్రమే ఫిల్డ్ సెట్ చేశాడని కామెంట్ చేశాడు. వికెట్లు తీసేందుకు ఎక్కడా అటాకింగ్ ఫిల్డ్ సెట్ చేయలేదని అన్నారు. ర్యాన్ రికెల్టన్, మల్డర్లను ఔట్ అవ్వగానే బవుమాపై ఒత్తిడి తీసుకొచ్చేలా బౌలింగ్ చేయాల్సిందని తెలిపారు. ఆసీస్ బౌలింగ్ విభాగంలో మునుపటి కాన్ఫిడెన్స్ లేదని.. డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్లో లో గెలవాలంటే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం తప్పనిసరి అని మాథ్యూ హెడెన్ అన్నారు. ఆసిస్ ప్లేయర్ల ఫీల్టింగ్ పొజిషన్లు చూసి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని డెయిల్ స్టెయిన్ తెలిపాడు.