త్వరలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ..
2024 లోనే 100 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించబోతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో స్కూల్ కు 100 నుంచి 15కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని అన్నారు. గురుకులాల పేరుతో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నుంచి 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో వీసీలను నియమిస్తామని చెప్పారు. సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మంది అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, ఎంపీలు, ఎమ్యెల్యేలు పాల్గొన్నారు.