అనాథ పిల్లల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్
సోనూసూద్ గతంలో ఈ పేరు వినగానే అందరికీ ఆయన ఓ విలన్‌గా మాత్రమే గుర్తుకు వచ్చేవారు. అయితే కరోనా సమయంలో సినిమాల్లో విలన్‌గా నటించే సోనూసూద్ కాస్త నిజ జీవితంలో హీరోగా మారారు. కాగా సోనూసూద్ కరోనా సమయంలో ఎందరో అభాగ్యులను ఆదుకుని వారికి అండగా నిలిచారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అయితే ఈ సూపర్ హీరో మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. బీహార్‌కు చెందిన తన అభిమాని అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కాగా అనాథ పిల్లల కోసం స్కూల్ బిల్డింగ్ కట్టిస్తానని..అవసరమైన సాయం అందిస్తానని హామి ఇచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సోనూసూద్ అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

