Home Page SliderTrending Today

సోనూసూద్‌పై కొండంత అభిమానం

సోనూసూద్ ప్రస్తుతం దేశంలో  ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే కరోనా లాక్‌డౌన్ సమయంలో సోనూసూద్ ఎంతోమందికి సాయం చేసి  తన ఉదారత చాటుకున్నారు. అయితే సోనూసూద్ బాలీవుడ్, టాలీవుడ్‌లో విలన్‌గా మెప్పించారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం మంచి ఆయన ఓ మంచి హీరోగా ఆయన గుర్తింపు పొందారు. కాగా కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశంలో ఎవరు చేయని విధంగా ఆయన ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి పేదలకు సాయం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగాను,దేశవ్యాప్తంగాను ఆయన పేరు మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎన్నో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన అభిమానులు ఆయనపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేక రీతిలో తెలియజేశారు. అదేంటంటే మధ్యప్రదేశ్‌లోని దేవాస్ స్టేడియంలో ఓ ఎకరం స్థలంలో 2500కేజీల బియ్యంతో ఆయన చిత్రాన్ని ఆవిష్కరించారు. కాగా వారు దీని కోసం ఓ ప్లాస్టిక్ కవర్‌ను నేలపై పరిచి సోనూసూద్ రూపాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.