అరెస్ట్ వారెంట్ జారీపై సోను సూద్ క్లారిటీ
ఫ్రాడ్ కేసులో తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలపై ప్రముఖ నటుడు సోను సూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని సెన్సేషనల్ చేస్తున్నారు. నాకు ఎటువంటి సంబంధం లేని అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు నన్ను పిలిచింది. మా న్యాయవాదులు న్యాయస్థానానికి రిప్లై ఇచ్చారు. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడరు కాదు. పబ్లిసిటీ కోసం నా పేరును కొందరు వాడుతున్నారు. ఈ నెల 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను. సెలబ్రిటీలను టార్గెట్ ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇలా చేయడం బాధాకరం’ అని పోస్ట్ పెట్టారు.