Home Page SliderInternational

ప్రిన్సెస్ డయానా నగల కోసం కుమారుల మధ్య తగాదా

తమ తల్లి దివంగత ప్రిన్సెస్ డయానా నగల కోసం బ్రిటన్ రాజకుటుంబంలో అంతఃపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి. తన తల్లి నగలను తన తమ్ముడు హ్యారీ భార్య మెర్కెల్‌కు ఇవ్వడానికి ప్రిన్స్ విలియం అంగీకరించలేదని హ్యారీ రాసిన స్పేర్ అనే పుస్తకం ద్వారా బయటపడింది. మరో రచయిత రాబ్ జాబ్సన్ రాసిన కేథరీన్, ది ప్రిన్సెస్ ఆప్ వేల్స్ అనే పుస్తకంలో కూడా విలియంకు, అతని తమ్ముడు హ్యారీకి తల్లి డయానా నగల విషయంలో గొడవలు జరిగాయని పేర్కొన్నారు. డయానా నిశ్చితార్థానికి ధరించిన ఉంగరాన్ని ప్రిన్స్ విలియం గతంలో కేట్ మిడిల్టన్‌కు ఇచ్చి ప్రపోజ్ చేశారు. అయితే తన సోదరుడు హ్యారీకి మాత్రం డయానా నగలు ఇవ్వడానికి నిరాకరించారు. హ్యారీ ప్రేమను రాజకుటుంబం అంగీకరించలేదని, దీనితో సోదరుల మధ్య బంధం దెబ్బతిందని పేర్కొన్నారు రచయిత. వేల్స్ యువరాణిగా ఉన్నప్పుడు తన తల్లి డయానా ధరించిన నగలను కేవలం వేల్స్ యువరాణిగా ప్రస్తుతం ఉన్న తన భార్య కేట్ మాత్రమే వినియోగించాలని విలియం భావించినట్లు తెలిపారు. అలాగే నటి మేఘన్ మెర్కెల్‌ను రాజకుటుంబం అంగీకరించపోయినా వివాహం చేసుకున్నందుకు ప్రిన్స్ హ్యారీని, మేఘన్‌ను తీవ్ర వేదనకు గురి చేశారని పేర్కొన్నారు.