సోనియాగాంధీకి మాతృ వియోగం
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఇటలీలోని స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. ప్రస్తుతం సోనియాగాంధీ విదేశీ పర్యటనలోనే ఉన్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియా చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం విదేశాలకు వెళ్లారు. చికిత్స అనంతరం తల్లిని చూసి రావాలని కూడా సోనియా భావించినట్లు జైరాం రమేష్ ట్విట్టర్లో తెలిపారు. ఈలోగానే తల్లి మరణ వార్త సోనియా కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.


