రాహుల్ అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ ముందు ఏదైనా బలాదూరే. అమ్మ అంటే అంతే మరి. సుదీర్ఘకాలం అనారోగ్యం తర్వాత బయట ప్రపంచానికి కన్పించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. గత నెల రోజులుగా భారత్ జోడో యాత్రతో దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ ఎలా ఉన్నాడో చూడాలని తపించిన తల్లి ప్రేమ కర్నాటకకు పరుగులు పెట్టించింది. తల్లిపై కొడుకు ఉన్న ప్రేమ… కొడుకుపై తల్లికి ఉన్న ప్రేమ వర్ణించలేని విధంగా పాదయాత్రలో కన్పించింది.

రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ షూలేస్‌ను కడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తల్లి పాదాల వద్ద మోకరిల్లి, ఆమె షూ లేస్‌లు కట్టడంలో సహాయం చేశాడు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ “మా” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది.
ఒకానొక సమయంలో, రాహుల్ గాంధీ ఆగి, తన తల్లిని విశ్రాంతి తీసుకోమని కోరడాన్ని వీడియోలో స్పష్టంగా కన్పించింది. ఆరోగ్యం బాలేదమ్మా.. ఇక వెళ్లండమ్మా అంటూ రాహుల్ గాంధీ సోనియాను వాహనం వద్దకు తీసుకెళ్లడం కూడా అభిమానులను కట్టిపడేసింది. రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఈ దృశ్యాలు కర్నాటకలో కన్పించాయ్…
ఆ తర్వాత ఆమె కారు ఎక్కిన కొద్ది సేపటి తర్వాత మార్చ్‌లో పాల్గొని తిరిగి రెస్టుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో తుఫానులను ఎదుర్కొన్నదని… సవాళ్లను అధిగమించిందని.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని సీనియర్ నేతలు చెబుతున్నారు. 75 ఏళ్ల సోనియా గాంధీ… కుమారుడు పాదయాత్రతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
కరోనా సోకిన ఏడాది తర్వాత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని చూడటంతో పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 2019 ఎన్నికల్లోనూ సోనియా ఎక్కడా కన్పించలేదు. 2016లో వారణాసి ఎన్నికల్లో మాత్రమే సోనియా రోడ్ షోలో సోనియా కన్పించారు. రాహుల్ గాంధీ యాత్రకు కర్నాటకలో విశేష స్పందన కన్పిస్తోండటంతో పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో… రాహుల్ యాత్ర పార్టీకి ఉపకరిస్తోందని నేతలు విశ్వాసంతో ఉన్నారు.

