తెలంగాణ నుండి ఎంపీగా సోనియాగాంధీ
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో సోనియాగాంధీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. ఈ మీటింగులో కాంగ్రెస్‌కు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు పీఏసీ సభ్యులు. ఐదు ముఖ్య అంశాలు ఎజెండాగా ఈ సమావేశం కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణను ప్రకటించిన సోనియాగాంధీ ఇక్కడినుండే పార్లమెంటుకు పోటీ చేయాలనే ఏకగ్రీవ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరుగ్యారెంటీల అమలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్పులు, గత ప్రభుత్వపు ప్రాజెక్టుల అవకతవకలు గురించి చర్చలు వచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ వేదికగా వీటిపై నివేదిక ఇస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయనున్న కాంగ్రెస్ నాయకుల అంశాలు, రాజ్యసభకు నామినేట్ చేయబోయే ఎంపీలు, ప్రతీ పార్లమెంటు స్థానానికి ఒక్కో మంత్రికి ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చామన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలియజేశారు.

