పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్న కొందరు యువకులు
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొందరు యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో జరిగింది. స్థానిక కొందరు యువకులు పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్నారు. కొందరు యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ జెండాలు రోడ్డుపై విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాశ్మీర్ ఘటన తర్వాత కూడా ఈ చర్య ఖండనీయం. సొంత దేశంలో విదేశీ జెండా ప్రేమ ఉండడం ఆందోళనను కలిగిస్తోంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.