Home Page SliderNational

ఆర్మీట్రక్కులో సజీవదహనమైన జవాన్లు

జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ప్రయాణంలో ఉన్న ఆర్మీట్రక్కులో హఠాత్తుగా మంటలు రేగి, నలుగురు జవాన్లు సజీవదహనమయ్యారు. ఈ మంటలకు కారణం పిడుగుపాటని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి ఉగ్రదాడులు కారణమై ఉంటాయా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈమధ్యనే బఠిండాలో సైనిక స్థావరంలో జరిగిన కాల్పులు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇంతలోనే ఈప్రమాదం జరగడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని సైనికాధికారులు ఆదేశించారు. పూర్తి సమాచారం ఇంకా  అందలేదు.