కేంద్రప్రభుత్వంపైనే సోషల్ మీడియా సంస్థ దావా..
కేంద్రప్రభుత్వంపై ఒక సోషల్ మీడియా సంస్థ దావా వేసింది. ఎలాన్ మస్క్‌కు సంబంధించిన సోషల్ మీడియా సంస్థ ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా వేసింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమ చట్టబద్దమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, తమపై అనధికారికంగా సెన్సార్ చేస్తున్నారని ఎక్స్ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ దావాపై కేంద్రప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి మాత్రమే పనిచేస్తుందని, సోషల్ మీడియా సంస్థలు కూడా నిబంధనలు పాటించాలని సమాధానమిచ్చింది.