Home Page SliderInternational

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

చిన్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రతినిధుల సభ ఆమోదం తెలుపగా.. సెనెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. అది కూడా పూర్తయితే.. బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. బుధవారం జరిగిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. 102 ఓట్లు వచ్చాయి. 13 మంది మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. మరో వారంరోజుల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. వెంటనే ఆదేశాలు జారీ అవుతాయి. తల్లిదండ్రుల నుంచి వస్తోన్న ఫిర్యాదుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.