అడవి పందుల వేటలో ” మంచు ” స్టాఫ్
ఈ ఏడాది మంచు వారి కుటుంబంలో రేగిన మంటల చుట్టూ మీడియా చలిగాచుకుందనే చెప్పాలి. ఏ ఆహారం దొరకనప్పుడు మీడియాకి సినీ ఇండస్ట్రీ నుంచి మంచు మోహన్ బాబు కుటుంబీకులు సరిపడ గ్రాసాన్ని వేస్తుంటారు. అందులోనూ రెండు మూడు మీడియా ఛానల్స్‌కి మోహన్ బాబుకి మించిన దూల ఉందనే చెప్పాలి. ఇక ప్రపంచంలో ఏ పనీ లేనట్లు వారి వార్తల కోసం భోజ్యంలా ఎదురు చూస్తుంటారు.ఇందులో భాగంగా మొన్న మంచు విష్షు,మనోజ్ ల మధ్య వార్‌ని ఓ వారం పాటు నడిపించిన మీడియా…ఇప్పుడు అడవి పంది చుట్టూ పెనవేసుకుపోయింది.మంచు విష్షు సిబ్బంది కిరణ్,దేవేంద్ర ప్రసాద్‌లు ఇద్దరూ అడవి పంది వేటకు సంబంధించిన విషయంలో ఇరుక్కున్నారు.అడవి పంది వారికి ఆహారంగా మారితే..మంచు కుటుంబపు వార్తలు వీరికి ఆహారంగా మారాయి. జల్ పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందిని వేటాడి తీసుకుపోతున్న మంచు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి మంచు ఫ్యామిలీని పోలీసులు వదిలినా ఆ రెండు ఛానల్స్ వదిలేలా లేవు.