Home Page SliderTelangana

విమానంలో పాములు.. భయాందోళనలో ప్రయాణికులు..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విషపూరితమైన పాములు లభ్యమయ్యాయి. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద విషపూరితమైన పాములు బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటి అని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అనకొండలుగా అధికారులు గుర్తించారు.