Andhra PradeshHome Page Slider

విశాఖలో ఇళ్లలోకి చొరబడిన పాములు

విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో ఉండే ఇళ్లలోకి కూడా పాములు రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీపావళి తర్వాత వారం రోజుల వ్యవధిలో 20కి పైగా  ఇలాంటి కేసులు వచ్చినట్లు స్నేక్ క్యాచర్స్ చెప్తున్నారు. దీపావళి టపాసులకు వచ్చిన పొగ కారణంగా పుట్టల్లోని పాములు ఇలా వస్తున్నాయని వారు చెప్తున్నారు. ఇవి చూడడానికి నాగుపాములా కనిపించినా ఇవి రాటిల్ స్నేక్స్ అని చెప్తున్నారు. బురదపాములేనని భయపడవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.