ఆన్‌లైన్ ఆర్డర్‌లో పాము డెలివరీ
అమెజాన్ ఆన్‌లైన్ ఆర్డర్‌లో ఒక జంటకు పాము డెలివరీ అయ్యింది. దీనితో వాళ్లు భయాందోళనలకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన ఈ జంట అమెజాన్ షాపింగ్ యాప్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. డెలివరీ వచ్చాక దానిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా దానిలో పాము బయటపడింది. అయితే ప్యాకింగుకు టేపు చుట్టుకోవడంతో అది బయటకు రాలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. సంస్థ భద్రతా పరమైన చర్యలు పాటించకపోవడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో అమెజాన్ స్పందిస్తూ డబ్బు రీఫండ్ చేస్తామని పేర్కొంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ దీనిని అమెజాన్ అడవుల నుండి ఆర్డర్ చేశారేమో అంటూ వ్యాఖ్యానాలు చేశారు.