అరుదైన రికార్డు నెలకొల్పిన స్మృతి మంధాన
టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును నెలకొల్పారు. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు సాధించారు. ఇప్పటి వరకూ కెప్టెన్ మిథాలీరాజ్ పేరిట మాత్రమే ఈ రికార్డు ఉండేది. అయితే మితాలీ 211 ఇన్నింగ్స్‌లో 7 సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పగా, స్మృతి కేవలం 84 ఇన్నింగ్స్‌లోనే 7 సెంచరీలను పూర్తి చేసి రికార్డు తిరగరాసింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ సాధించింది.

