‘దమ్ముంటే నాతో సివిల్స్ రాయమన్న’ బాలలత సవాల్‌కు స్మితా సబర్వాల్ కౌంటర్
దివ్యాంగులకు యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండకూడదని వ్యాఖ్యానించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్న మాజీ ఐఏఎస్ బాలలత, స్మితపై మండిపడ్డారు. దివ్యాంగులు అన్ని రకాల బాధ్యతలు నెరవేర్చగలరని, చాలా తెలివైనవారని, దమ్ముంటే తనతో కలిసి మరోసారి సివిల్స్ రాద్దామని సవాల్ చేశారు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ సవాల్ చేశారు. దీనికి స్మితా సబర్వాల్ ట్వీట్ చేస్తూ, తనకు సివిల్స్ రాసే వయసు దాటిపోయిందని, లేకపోతే మీ సవాల్ స్వీకరించేదాన్నంటూ బదులిచ్చారు. తాను పరీక్ష రాయడానికి యూపీఎస్సీ నిబంధనలు ఒప్పుకోవంటూ బదులిచ్చారు. అంతేకాక బాలలతను ఉద్దేశించి, మీ దివ్యాంగ రిజర్వేషన్‌ను, ప్రజలకు ఫీల్డ్ వర్క్ కోసం వాడారా, కోచింగ్ సెంటర్ నడిపేందుకు వాడారా అంటూ ప్రశ్నించారు.

