సింగిల్ ఛార్జింగ్ లో 581 కి. మీ. ల మైలేజ్
దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండు దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా… సరికొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్ యూవీ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ఎర్రోక్ మాడల్ ను ప్రవేశపెట్టింది. 82 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్త్ లో 581 కిలో మీటర్ల మైలేజీ ఇవ్వనుంది. కేవలం 6.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 180 కిలోమీటర్ల ప్రయాణించనుంది. దీంతో పాటు మరో మాడల్ ఎల్రోక్ 50ని కూడా పరిచయం చేసింది. 52 కిలో ఈ రెండు వాట్ల బ్యాటరీతో తయారైన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్ లో 375 కిలోమీటర్లు ప్రయాణించనుంది.