Home Page SliderNational

సియా రామ్ బాబా కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సియా రామ్ బాబా (94) కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన ఇవాళ ఉదయం 6:10 గంటలకు
ఖార్గోన్ లో తుదిశ్వాస విడిచారు. బాబా కడసారి చూపు కోసం మధ్య ప్రదేశ్ లోని భట్యాన్ లో ఉన్న ఆశ్రమానికి భక్తులు పోటెత్తారు. సియారాం బాబా అంత్యక్రియలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరుకానున్నారు. 12 ఏండ్ల పాటు ఒంటికాలిపై నిలబడి తపస్సు చేశాడని ఆయన గురించి చెబుతారు. రామచరిత మానస్ పఠిస్తూ అన్ని కాలాల్లోనూ చిన్న లంగోటీతో మాత్రమే జీవించిన బాబా.. భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయిని సమాజానికి ఇచ్చేశారు. కేవలం రూ.10 విరాళాలు స్వీకరించే వ్యక్తిగా పేరుగాంచిన ఆయన తన జీవితాన్ని మతపరమైన అభ్యున్నతికి అంకితం చేశారు. నర్మదా నది ఘాట్లను బాబా ఇచ్చిన రూ.2.57 కోట్లతోనే అధికారులు అభివృద్ధి చేశారు. నర్మదా పుత్రుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.