Home Page SliderTelangana

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు..

హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌ శాంతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లోని ఓ ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుకున్నాడు. విషయం తెలుసుకున్న అపార్ట్‌మెంట్‌ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడిని కాపాడారు. ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు.