మహిళా రెజ్లర్ పేరిట ఆరు గిన్నిస్ రికార్డులు
గిన్నిస్ రికార్డు ఒకటి సాధిస్తేనే ప్రపంచాన్ని జయించినంత ఉప్పొంగిపోతూ ఉంటారు సాధారణ ప్రజలు. అలాంటిది నట్యాల అనే కెనెడియన్ అమెరికన్ మహిళా రెజ్లర్ ఒకిటి రెండూ కాదు ఏకంగా ఆరు గిన్నిస్ రికార్డులు సాధించింది. 2007 నుండి ఆమె రెజ్లర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఇటీవలే వచ్చిన మూడు గిన్నిస్ రికార్డులతో కలిసి మొత్తం ఆరు రికార్డులు వచ్చాయి. వరల్డ్ రెజ్లింగ్ మ్యాచ్‌లు అత్యధికంగా ఆడిన మహిళ ఆమే కావడం విశేషం. ఆమె ఇప్పటివరకూ ఎవ్వరూ ఆడని విధంగా 1514 వరల్డ్ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 663 మ్యాచ్‌లు గెలిచింది. తన గిన్నిస్ రికార్డులను ప్రదర్శిస్తూ వీటిని తీసుకెళ్లడానికి పెద్ద లగేజ్ కావాలంటూ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేసింది. 2021లో తొలిసారి గిన్నిస్ రికార్డు సాధించిన ఆమె ఈ రెండేళ్లలోనే ఆరు రికార్డులను సాధించడం సామాన్యం కాదు. తన కుటుంబమే తనకు బలమని, వ్యక్తిపై గెలిచినట్లు కాకుండా తన నైపుణ్యాన్ని పెంచుకోవడానికే ఆడుతున్నానంటూ ట్వీట్ చేసింది.

