బోరుబావిలో ఆరు రోజులుగా నరకం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో మూడేళ్ల చిన్నారి చేతన ఆరు రోజులుగా బోరుబావిలో నరకం అనుభవిస్తోంది. సోమవారం జరిగిన ఈ సంఘటనలో ఇప్పటి వరకూ ఆ బిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు సహాయక సిబ్బంది. 700 అడుగులు గల బోరుబావిలో చిన్నారి 150 అడుగుల లోతు వద్ద బాలిక చిక్కుకున్నట్లు కనిపెట్టారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తూ, బావికి సమాంతరంగా సొరంగం తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ సహాయం తీసుకున్నారు. దీనితో తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎలాగైనా రక్షించాలంటూ అధికార యంత్రాగాన్ని వేడుకుంటున్నారు.