సీతారామ పంప్ హౌస్ ట్రయల్ రన్: మంత్రి తుమ్మల
తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ట్రయల్ రన్ పూర్తయింది. ఆగస్టు 15 నాటికి సాగర్ లింక్ కెనాల్‌కు అనుసంధానించి గోదావరి జలాలు అందించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రాజెక్ట్ మొదటి పంప్‌హౌస్ వద్ద ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేసి నీటిని విడుదలచేయాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

