Home Page SliderNational

సిసోదియాకు ఈ స్థితిలో బెయిల్ ఇవ్వలేం..దిల్లీ హైకోర్టు

దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కస్టడీలో ఉన్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాకు మరోసారి బెయిల్ నిరాకరించింది దిల్లీ హైకోర్టు. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. జస్టిస్ దినేష్ కుమార్ సిసోదియా బెయిల్‌కు అంగీకరించలేదు. సిసోదియాతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజినెస్ మ్యాన్ అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, విజయ నయ్యర్‌ల బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించారు. 2021లో దిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో వందల కోట్ల స్కామ్ జరిగిందంటూ అవినీతి ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై సీబీఐ కూడా దర్యాప్తు చేసి, మనీష్ సిసోదియాను నిందితునిగా పేర్కొంటూ అరెస్టు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అదుపులో తీసుకుంది. ఇప్పటివరకూ మూడుసార్లు బెయిల్‌ కోసం అప్లయ్ చేయగా అతనికి బెయిల్ లభించలేదు.