ఆస్ట్రేలియాను చావుదెబ్బతీసిన సిరాజ్, షమీ
తొలి వన్డేలో ఆస్ట్రేలియా వెన్ను విరిచిన భారత్ బౌలర్లు
మూడేసి వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ
188 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్, మిచెల్ మార్ష్ 81
వాంఖెడే స్టేడియంలో దుమ్మురేపిన టీమిండియా
మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చెరి మూడు వికెట్లు తీయడంతో, శుక్రవారం ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఆస్ట్రేలియాను, 188 పరుగులకు ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్ల తీసి సత్తా చాటాడు. టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి.. మంచి ఊపు మీద కన్పించింది. కానీ, మిచెల్ మార్ష్ అందించిన శుభారంభాన్ని అందుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడపడ్డారు. మిచెల్ మార్ష్ 65 బంతుల్లో 81 పరుగులు చేసి 20వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఓటయ్యాడు. ఆ తర్వాత ఒక్కో వికెట్ వరసుగా పడ్డాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత స్టాండ్ ఇన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.