హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కుమారుడు
ప్రసిద్ధ తెలుగు గాయకురాలు, డబ్బింగ్ ఆర్టిస్టు సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆమె గాయనిగానే కాకుండా పాడుతా తీయగా వంటి టీవీ మ్యూజిక్ షోలలో జడ్జిగా కూడా పనిచేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న సర్కారు నౌకరి అనే ఈ చిత్రానికి గంగనమోది శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా భావన అనే అమ్మాయి నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను షేర్ చేశారు సునీత. దీనిలో పెద్దరోగానికి చిన్న ఉపాయం అంటూ చెట్టుకి ఒక డబ్బా వ్రేలాడుతూ ఉంటుంది. ఈ చిత్రం 80 వదశకంలో జరిగిన కథలా అనిపిస్తోంది. వెనుక ఒక పల్లెటూరు, ముందు హీరో రఫ్ లుక్‌తో ఆసక్తి కలిగిస్తోంది ఈ పోస్టర్. సునీత స్పందిస్తూ కంగ్రాట్స్ ఆకాశ్. ఒక తల్లి, కుమారుని కల నెరవేరిన రోజిది, నీ కష్టం, శ్రమ తప్పక ఫలిస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు సునీత.


