మగబిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతా మాధురి
సింగర్ గీతా మాధురి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు నందు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ నెల 10న తమకు పాప పుట్టిందన్న వార్తను నందు పంచుకున్నారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నాడు. రెండో బిడ్డ రాకతో కుటుంబమంతా పండుగ వాతావరణం నెలకొందని రాసుకొచ్చాడు. వీరి జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గీతా మాధురి, నందు 2019లో వివాహం చేసుకున్నారు. వారికి అంతకు ముందు 2021లో పాపు పుట్టింది. ఆమెకు దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు.
Read more: ఏపీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యం: సీఎం వైఎస్ జగన్