సింగరేణి ఓపెన్ కాస్ట్ గ్రామాల బ్రతుకు చిత్రాలు ఇంకెన్నాళ్లు?
సింగరేణి ఓపెన్ కాస్ట్ గ్రామాలలో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. పదేళ్లుగా సింగరేణి గ్రామాలలో ప్రజలు పరిహారం లభించక, నిత్యం బాంబు బ్లాస్ట్‌లతో దద్ధరిల్లిపోతున్నాయి అక్కడి ప్రదేశాలు. వారి ఇళ్లు బీటలు వారుతున్నాయి. అక్కడి నిర్వాసితుల పంటభూములను సేకరించి, నల్లబంగారం మైనింగ్‌తో వందల కోట్లు సంపాదిస్తోంది సింగరేణి. కానీ అక్కడి ప్రజలకు తినడానికి తిండిలేదు. భూములు, ఇళ్లు సేకరించిన వారికి పదేళ్ల క్రితం వారికి కాస్త పరిహారం విదిల్చి, మళ్లీ దాని మాటే ఎత్తడం లేదు. అక్కడి ప్రజలకు ఆరోగ్యాలు పాడయ్యి రోగాల బారిన పడుతున్నారు. వారు తినే అన్నంలో, తాగే నీళ్లలో బూడిద కనిపిస్తోంది. భూగర్భ జలాలు కలుషితమయ్యి అనారోగ్యం పాలవుతున్నారు. 2013 నుండి అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వ పరిహారం అందక, అనారోగ్యాల పాలయి బూడిదగుట్టలయిన ఊర్లలో జీవచ్ఛవాలుగా జీవితం కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ గ్రామాలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు వారు.