Home Page SliderTelangana

సింగరేణి ఎన్నటికీ ప్రైవేట్ పరం కాదు-కిషన్ రెడ్డి

సింగరేణి బొగ్గుగనులను ఎన్నటికీ ప్రైవేట్ పరం చేయం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రశ్నేత్తరాల సమయంలో సింగరేణి ప్రైవేటీకరణ, ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల గురించి ఆయన ప్రశ్నించారు. దీనితో పాటు సింగరేణిని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలంటూ కోరారు. దినికి సమాధానంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో ఏ గనినీ ప్ర్రైవేట్ పరం చేయదని బదులిచ్చారు. పైగా సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రప్రభుత్వానికి ఉందన్నారు. దానివల్ల సింగరేణికి సంబంధించిన నిర్ణయాలు రాష్ట్రప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.