రజతోత్సవాలు టీఆర్ఎస్ కా..? బీఆర్ఎస్ కా..?
బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈనెల 27న జరగబోయే రజతోత్సవాలు టీఆర్ఎస్ కా..? బీఆర్ఎస్ కా..? అని చామల కిరణ్ ఎద్దేవా చేశారు. ‘2001లో టీఆర్ఎస్ పార్టీని నెలకొల్పారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకోవాలనే ఆలోచనతో పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు రజతోత్సవాలు టీఆర్ఎస్ కు చేస్తున్నారా? బీఆర్ఎస్ కు చేస్తున్నారా?’ అని కాంగ్రెస్ ఎంపీ సెటైర్లు వేశారు.

