సిద్దిపేట: ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభ-ఈటల
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
నేను వచ్చాక సర్పంచ్లను పిలిచి బిల్లులు ఇచ్చారు. వారి గౌరవం పెరిగింది. లేదంటే పట్టించుకునే దిక్కులేదు. ఈ ఊళ్లో స్మశాన వాటిక కూడా లేదు. పదేళ్లు పడుకొని ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని డబుల్ బెడ్ రూం ఇళ్ళకోసం దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చి మోసం చేస్తున్నారు. మూడో తారీఖు తరువాత ఇవి పనికి రావు. పదేళ్ల క్రితం రూ.6 లక్షలు ఇల్లు కట్టుకోడానికి ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు రూ.3 లక్షలే ఇస్తామంటున్న సర్కారు? దేశంలో ధరలు తగ్గాయా? దేశాన్ని ఏలుతున్న పార్టీ బీజేపీ. మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది. చక్రవర్తిలాగా, రాజులాగా అధికారాలన్నీ తన దగ్గర పెట్టుకొన్నారు.. తప్ప కిందివారికి పెన్షన్ ఇచ్చే అధికారం లేదు. మేము వచ్చాక అందరికీ ఇస్తాం. గ్రామపంచాయతీ సిబ్బందికి కూడా కెసిఆర్ జీతాలు ఇవ్వలేకపొతున్నాడు. ఆ డబ్బులు ఇస్తుంది కేంద్రం. పేదల భూములు పోకుండా కాపాడే జిమ్మేదార్ మాది. కెసిఆర్కి మళ్లీ ఓటు వేస్తే గోస పడతాం.