Home Page SliderTelangana

సిద్దిపేట: గజ్వేల్-ములుగు మండలం బండమైలారం గ్రామ ఎన్నికల ప్రచారంలో ఈటల

సిద్దిపేట: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం బండమైలారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈటల మాట్లాడుతూ: కెసిఆర్ భూములు గుంజుకొని.. తల్లిని పిల్లని వేరు చేసినట్టు బాధపెడుతున్నారు.

బీజేపీ వచ్చాక ఒక్క ఎకరం కూడా తీసుకోము.

• కెసిఆర్‌ ఓడిపోతేనే మన భూములకు రక్షణ ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్, రుణమాఫీ, 57 ఏళ్లకే పెన్షన్, మహిళలకు వడ్డీలేని రుణాలు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడు ఎకరాలు ఏవీ ఇవ్వలేదు.

నరేంద్ర మోదీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వమని చెప్పారు.

• డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పమన్నారు.

• వరికి రూ.3,100 లు మద్దతు ధర ఇస్తామన్నారు. ఒక్క ఎకరానికి 25 వేల రూపాయలు అదనంగా లాభం చేకూరుతుంది.  డ్రిప్పు, స్పిక్లర్లు, ట్రాక్టర్ల సబ్సిడీ, గ్రీన్ హౌస్, పాలేహౌజ్, పందిరి వ్యవసాయం, వ్యవసాయ పనిముట్లు అన్నిటినీ సబ్సిడీ ధరల్లో  అందించేవారు కానీ కెసిఆర్ ఒక్క రైతుబంధు ఇచ్చి ఇవన్నీ తీసివేశారు. బిజెపి వస్తే ఇవన్నీ పునరుద్ధరిస్తాము.

• బిజెపి వస్తే పెన్షన్లు పోవు.

• ముసలి వారి ఇద్దరికీ పెన్షన్లు అందిస్తాము.

• పార్టీలు మారినా,  ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా ఉన్న స్కీములు పోవు.

• గరీబ్ మహిళలకు 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము.

• 10 లక్షల రూపాయల లోపు..  వైద్యం ఉచితంగా అందిస్తాము.

• మీ పిల్లల ఫీజుల భారం మీ మీద పడకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన ఇంగ్లీష్  మీడియం విద్య ఉచితంగా అందిస్తాము.

• ఆడపిల్ల పుడితే రెండు లక్షల రూపాయలు  డిపాజిట్ చేస్తాము.

• బీజేపీ మాట ఇస్తే తప్పేది కాదు. మాట ఇచ్చి తప్పే వ్యక్తి కేసీఆర్.

• మల్లన్న సాగర్‌లో 9 గ్రామాలు మునిగిపోతే వారిని తీసుకువచ్చి గజ్వేల్‌లో పెట్టాడు. అందులో ఉన్నవారికి ఏ పనీలేదు.

• మల్లన్న సాగర్ భూనిర్వసితులు అడ్డా మీద కూలీలుగా మారారు.

• భూములు తీసుకొని కార్పొరేట్ కంపేనీలకు  అమ్ముకుంటున్నారు.

•  కెసిఆర్‌కి ఓటు వేసినందుకు మన భూములు గుంజుకుంటున్నారు.

• మళ్ళీ ఓటు వేస్తే ఊర్లకు ఊర్లని మాయం చేస్తాడు. 

• కేసీఆర్‌కి గుణపాఠం చెబుదాం.

• ఆ పూటకు తినే బిర్యాని కావాలా? రైతులకు రూ.20 వేల మద్దతు ధర కావాలా?

• మందు సీసా కావాలా? మన ఊరు ఉండాలా?

• కెసిఆర్ ఇచ్చేవి కావాలా? మన భూములు కావాలా?