సిద్దిపేట: దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో ఈటల
సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.
దుబ్బాకలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సుత్తితో కేసీఆర్ అహంకారాన్ని కొట్టారు. రఘునందన్ రావుని గెలిపించారు. కేసీఆర్‌కే హడలు పుట్టించారు. నాది రోషం కలిగిన పుట్టుక. ఏం లేకపోయినా నా జాతికి రోషం ఉంటుంది. రాజీనామా చెయ్యమంటే కేసీఆర్ ముఖాన కొట్టి వచ్చా. కష్టాన్ని, ప్రజల్ని నమ్ముకున్నా అందుకే ఎన్నికలకు పోయిన. ఆరడుగుల బుల్లెట్‌కి హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారు. దళితబంధు ఇవ్వకుండా దుబ్బాక గడ్డమీద ఎలా అడుగుపెడతావు కేసీఆర్. గజ్వేల్‌లో 30 వేల కుటుంబాలు కేసీఆర్ బాధితులు ఉన్నారు. వారికి నాయకుణ్ణి నేను. గజ్వేల్‌లో ఒక్కో బూత్‌కి 25 కాటన్‌ల మందు పంచిపెట్టారట. ప్రపంచానికి వాక్సిన్ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోదీ. మాట ఇస్తే తప్పని బిడ్డ మోదీ అయితే మాటమీద నిలబడని వ్యక్తి కేసీఆర్. మూడవ తారీఖు తరువాత ప్రతి క్వింటా వడ్లు 3,100 రూపాయాలకు కొంటాం. తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబ పెద్దకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందిస్తాం. రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేశాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తాం. కేసీఆర్ ఇచ్చే డబ్బులు, మందు తీసుకోండి. ఓటు మాత్రం బీజేపీకి వేయండి.