కన్నులపండుగగా సిద్ధార్థ్, అదితీల వివాహం
హీరో సిద్ధార్థ్, నటి అదితీరావు హైదరీల వివాహం నేడు వనపర్తిలోని దేవాలయంలో సన్నిహితుల సమక్షంలో జరిగింది. సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులెవ్వరినీ ఆహ్వానించలేదు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వివాహం జరిగింది. వనపర్తి సంస్థానానికి చెందిన 400 ఏళ్ల నాటి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. అదితీరావు ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నువ్వే సూర్యుడివి, చంద్రుడివి, నా సోల్‌మేట్ అంటూ మిసెస్ అండ్ మిస్టర్ సిద్దు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన జంటకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
