సీఎం పదవిపై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక సీఎం పదవిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా కర్ణాటకలో సీఎం పదవి నాకు కావాలి అంటే నాకే కావాలి అంటూ సిద్దరామయ్య,డీకే శివకుమార్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు 85 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ సిద్దరామయ్య అన్నారు. సీఎల్పీ భేటి బ్యాలెట్‌లో మెజారిటీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారంటున్నారు. అంతేకాకుండా ఎమ్మేల్యేలు తమ బ్యాలెట్ పేపర్లను కూడా హైకమాండ్‌కు అందించారన్నారు. అధిష్టానం తననే సీఎంగా చేస్తుందని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య స్పష్టం చేశారు.