Home Page SliderNational

కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. కర్నాటక గవర్నర్ థావర్ చెంద్ గెహ్లాట్, సిద్ధరామయ్యతో ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బెహగల్‌తోపాటుగా, విపక్షాల నుంచి తమిళనాడు సీఎం డీకే స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్ము, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా‌తోపాటు, సినీ నటులు కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కర్నాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్‌తోపాటు, కాంగ్రెస్ అతిరథమహారథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సిద్ధరామయ్య ఆగష్టు 3, 1947లో జన్మించారు. అందరూ ఆయన్ను సిద్దూ అని పిలుస్తారు. 20 మే 2023న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, అంతకు ముందు అంటే 2013 నుండి 2018 వరకు ఆయన సీఎంగా వ్యవహరించారు. కర్నాటకలో పూర్తి ఐదేళ్లపాటు సీఎంగా వ్యవహరించిన రెండో వ్యక్తి సిద్ధరామయ్య. 2018కి ముందు ఆయన బాదామి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతినిధ్యం వహించారు. 2008 నుండి 2018 వరకు, 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గానికి, 2004-2007 వరకు, 1994-1999, 1983-1989 వరకు చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. 1996 నుండి 1999 వరకు, 2004- 2005 వరకు జేడీఎస్‌లో ఉన్న ఆయన కర్నాటక ఉప ముఖ్యమంత్రిగానూ వ్యవహరించారు. 2019- 2023, 2009-2013 వరకు రెండు పర్యాయాలు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.