కర్ణాటక సీఎం సిద్దరామయ్య కాదు: సూర్జేవాలా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యినప్పటి నుంచి కర్ణాటక సీఎం ఎవరా అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ ఉత్కంఠకు తెరపడుతుందని కర్ణాటక ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వారంతా ఆశించారు. అయితే ఈ రోజు సిద్దరామయ్యే సీఎం అని హైకమాండ్ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.దీనిపై కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ రణదీప్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని..నేడో రేపో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సూర్జేవాలా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మీడియా వర్గాలు చెప్తున్నట్లు సీఎం ప్రమాణ స్వీకారం తేది కూడా తప్పేనని సూర్జేవాలా స్పష్టం చేశారు. మరోవైపు సిద్దరామయ్యే సీఎం అని మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్న వేళ.. సూర్జేవాలా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.