ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా కుంభకోణం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించవలసిన అవసరం ఏర్పడింది. దీనికోసం రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. మూడు పిటిషన్లు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫైల్ అయ్యాయని గవర్నర్ తెలిపారు. ముడా లేఅవుట్స్ డెవలప్‌మెంట్ వల్ల స్థలాలు కోల్పోయిన వారు ఈ పిటిషన్లు వేసినట్లు సమాచారం. వారికి 50 శాతం స్థలం కానీ, వేరే ప్రదేశంలో స్థలాలు కానీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

