తెలంగాణాలో ఆ రెండు పరీక్షలను కూడా రద్దు చేయాలి
తెలంగాణా రాష్ట్రంలో ఇటీవల పలు పోటి పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణా ప్రభుత్వం దాదాపు 5 రకాల పోటి పరీక్షలను రద్దు చేసింది. అయితే తెలంగాణాలో గతంలో నిర్వహించిన ఎస్సై ,కానిస్టేబుల్ పరీక్షలను కూడా రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.కాగా ఈ పరీక్షలలో 133,144 టాప్ మార్కులుగా ఉన్నాయి. అయితే ఇటువంటి పోటి పరీక్షలలో అన్ని మార్కులు సాధించడం అసాధ్యమని అర్హత సాధించని అభ్యర్థులు వెల్లడిస్తున్నారు. ఎస్సై,కానిస్టేబుల్ పరీక్షల పేపర్లు కూడా లీక్ అయ్యాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే లీక్ అయ్యి,రద్దు చేయబడిన పలు పరీక్షల విషయంలో విచారణ కొనసాగుతోంది.

