Home Page SliderInternationalNews Alert

నోరు మూసుకో.. నేను నీ పని మనిషిని కాను.. ఉద్యోగినిని..

విమాన ప్రయాణంలో ఎయిర్‌ హోస్టెస్‌కు, ప్రయాణికులకు గొడవ జరగడం సర్వసాధారణం. అయితే.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణికుడికి, ఎయిర్‌ హోస్టెస్‌కు మధ్య ఆహారం విషయంలో గొడవ జరిగింది. ఇస్తాంబుల్‌ – ధిల్లీ విమానంలో ఈ నెల 16న ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు దీనిని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఎయిర్‌ హోస్టెస్‌ ఆ వ్యక్తితో మాట్లాడుతూ.. మీ వల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారు. మీ బోర్డింగ్‌ పాస్‌లో ఏం ఉందో దాని ప్రకారమే మేము ఆహారాన్ని అందిస్తున్నాం అని చెప్పింది. దానికి ప్రయాణికుడు స్పందిస్తూ… నువ్వు ప్రయాణికుడికి సేవకురాలివి అని వ్యాఖ్యానించాడు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేను ఉద్యోగిని.. నీకు పని మనిషిని కాను అని గట్టిగా వార్నింగ్‌ చేసింది. దీంతో ఎందుకు అరుస్తున్నావు.. నోర్మూసుకో అని ప్రయాణికుడిని హెచ్చరించింది. ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఆమె సహోద్యోగి వారిద్దరిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.