శుభ్‌మన్ గిల్ నాణ్యమైన ఆటగాడు
భారత యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. కాగా ఇటీవల ముగిసిన IPL సీజన్‌లో గిల్ తన ఆటతో అదరగొట్టాడు. దీంతో ఈ IPL సీజన్‌లో అందరి కంటే ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాడు. ఈ విధంగా గిల్ అందరిని దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ వసీం అక్రమ్ గిల్‌పై చేసిన కామెంట్లను పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సమర్ధించారు. కాగా వసీం అక్రమ్ గిల్ బౌలింగ్ చేస్తే సచిన్‌కు వేసినట్లు భావిస్తానని పేర్కొన్నారు. అయితే ఈ కామెంట్లకు గిల్ అర్హుడని సల్మాన్ భట్ వెల్లడించారు. ప్రస్తుత క్రికెటర్లలో నాణ్యమైన ఆటగాడు గిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదని సల్మాన్ భట్ స్పష్టం చేశారు.

