Home Page SliderNational

విపరీత ప్రచారాన్ని అందుకున్న  “స్త్రీ 2”

మళ్ళీ చాలా కాలం తర్వాత హిందీ నుండి పలు మంచి సబ్జెక్ట్‌లతో సినిమాలు వచ్చి హిట్ అవుతున్నాయి. అలా హిందీలో పలు సీక్వెల్ సినిమాలు ఉండగా వాటిలో ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “స్త్రీ 2”. బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ మెయిన్ లీడ్‌ రోల్‌లోను, టాలెంటెడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ హీరోగా, దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ హారర్ సినిమా పట్ల మళ్ళీ చాలాకాలం తర్వాత బాలీవుడ్ మార్కెట్‌లో గట్టి ప్రచారాన్ని తెచ్చుకుంటోంది. మొదటి భాగం పెద్ద హిట్ కావడం, ఇప్పుడు రెండో భాగం ట్రైలర్, టీజర్‌లు కూడా వరుసలో ఉండడంతోనూ, ఈ సినిమా రిలీజ్ దగ్గరబడుతుండడంతో మరిన్ని అంచనాలున్నాయి. ఇక లేటెస్ట్‌గా బుకింగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని ట్రేడ్ వర్గాల విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క నార్త్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ వంటి సిటీస్‌లో కూడా సాలిడ్ బుకింగ్స్ స్త్రీ 2 కి, అది కూడా హిందీ భాష అంటే అభిమానం ఉండే ఫ్యాన్స్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఈ సినిమా అయితే భారీ ఓపెనింగ్స్‌నే అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు చేస్తుందో ఎదురుచూడాల్సిందే.