‘నాగిని’గా శ్రద్ధాకపూర్
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో నాగినిగా నటిస్తున్నట్లు తెలిపారు. గతంలో శ్రీదేవి సూపర్ హిట్ మూవీ ‘నగినా’ అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది శ్రద్ధ. ఇప్పుడు అదే నాగిన్ పాత్ర తనకు రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. ‘స్త్రీ 2’ సక్సెస్‌తో శ్రద్ధా కపూర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల ‘పుష్ప2 ది రూల్’లో కూడా ఐటమ్ సాంగ్‌కు శ్రద్ధాను సంప్రదించగా భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనితో క్రేజీ డాన్సింగ్ బ్యూటీ శ్రీలీలను బన్నీతో పాటకు బుక్ చేశారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ వేరే లెవెల్ అంటున్నారు మేకర్స్.