Home Page Sliderhome page sliderTelangana

సునీతా రావుకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ పదవుల విషయంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఆమె కీలక క వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు ధర్నా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గోషామహాల్ కాంగ్రెస్ మహిళా నేతలు సునీతరావుపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ షోకాస్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.