మహిళాదినోత్సవం నాడు పచ్చి అబద్దాలా?
సీఎం రేవంత్ రెడ్డి మహిళాదినోత్సవం నాడు సభలు పెట్టి పచ్చి అబద్దాలాడారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.వడ్డీలేని రుణాలను రూ.21వేల కోట్ల మేర పంపిణీ చేశామని సీఎం రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల కన్నీళ్లు తెప్పించి వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి తాను మహిళా పక్షపాతని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.తులం బంగారం ఇస్తానని చెప్పి తెలంగాణా ఆడబిడ్డలను నిలువునా మోసం చేసి మహిళా ద్రోహిగా ముద్రపడ్డారని హరీష్ రావు అన్నారు.మహిళాదినోత్సవం నాడే తన సభకొచ్చిన మహిళలందరినీ నిర్బంధించిన వ్యక్తిగా చరిత్ర హీనుడయ్యాడని మండిపడ్డారు.రెండో సారి రేవంత్ నోట ఆడబిడ్డల సంక్షేమం అని నోరెత్తితే కొడతారని హెచ్చరించారు.