మమతాబెనర్జీ రాజీనామా చేయాల్సిందేనా?
కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఉదయం ఆర్జీ కార్ వైద్య కళాశాల వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆమె బెంగాల్‌లో శాంతిభద్రతలు చక్కదిద్దడంలో విఫలమయ్యారని, ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీల్లేదంటూ బీజేపీ మహిళా విభాగం వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నివాసం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామని తెలిపింది. అలాగే బీజేపీ మహిళా మోర్చా అధ్వర్యంలో హజ్రా క్రాసింగ్ నుండి కాళీ ఘాట్ వరకూ కూడా కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాడు ర్యాలీలు నిర్వహించి, రోడ్లను నిర్భందిస్తామని, మృతురాలికి సత్వర న్యాయం జరిగే వరకూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.