Home Page SliderTelangana

నువ్వైనా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలి..

స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గానికి కడియం శ్రీహరి స్థానికేతరుడు అని.. ఆయన్ను పర్వతగిరి పంపేదాక నిద్రపోనని బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి. లేదా నేనైనా ఉండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై రాజయ్య కౌంటర్ ఇచ్చారు. కడియం సవాల్ ను స్వీకరిస్తున్నానని తనకు ఎక్కడా పోటీ రాలేదని అన్నారు.. తాను వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. కడియం ప్రజా నాయకుడు కాదని… రాజకీయ నాయకుడు మాత్రమేనని విమర్శించారు. ‘ నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడే ఉంటా… రేపు చస్తే ఇక్కడే నన్ను బొంద పెడతారు. ‘ అని చెప్పారు, కడియం అవినీతి తిమింగలంలా తయారయ్యాడని విమర్శలు గుప్పించారు.