NationalNews Alert

కారు కొన్న ఆనందంలో కాల్పులు

ఎవరైనా కొత్త కారు కొంటే స్వీట్లు పంచుతారు. కానీ ఈ వ్యక్తి కొత్త కారు కొన్న ఆనందంలో చేసిన పని అతనిని అరెస్ట్ చేసే వరకు తీసుకెళ్లింది. పంజాబ్‌లోని మొహాలీలో ఓ వ్యాపారవేత్త కొడుకు కారు కొన్నాడు. కారు కొన్న ఆనందంలో జనం కేరింతల మధ్య తుపాకీతో గాల్లో కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో ఆ గన్ ఏవరిది అనే విషయంపై పోలీసులు విచారణ జరిపారు. ఐతే ఆ గన్ అతని పేరుతో కాకుండా ఫ్రెండ్ పేరుతో రిజస్ట్రేషన్ చేసి ఉందని పోలీసులు నిర్ధారించారు. లైసెన్స్ లేకుండా గన్ వాడినందుకు గాను అతని పై కేసు నమోదు చేశారు.